కేసీఆర్ ఉచితాలు… గ్రేటర్ ఎన్నికల కోసం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పార్టీ ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. నగరంలో డిసెంబరు నుంచి తాగునీరు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇరవై [more]

Update: 2020-11-23 09:01 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పార్టీ ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. నగరంలో డిసెంబరు నుంచి తాగునీరు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇరవై వేల లీటర్లు వాడుకునే వారు ఈ బిల్లులు చెల్లించాల్సిన పనిలేదని కేసీఆర్ చెప్పారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెలూన్లకు ఉచిత విద్యుత్తును ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జంట నగరాలతో పాటు రాష‌్ట్ర వ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్లకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. హైదరాబాద్ ఒక గొప్ప చారిత్రక నగరమన్నారు. హైదరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని చెప్పారు. పదికోట్లలోపు ఖర్చు చేసే సినిమాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ కు పదమూడు వేల కోట్ల సముద్ర సీవరేజ్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నామన్నారు. వరద నివారణ చర్యల కోసం పన్నెండు వేల కోట్ల తో ప్లాన్ ను రూపొందిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఇకపై నగరంలో 24 గంటలు తాగునీటిని సరఫరా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. గోదావరితో మూసీని అనుసంధానం చేస్తామని కేసీఆర్ చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్య ను పరిష్కరిస్తామని చెప్పారు. హైదరాబాద్ కు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. బస్తీల్లోని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News