కరుణానిధి హెల్త్ బులిటెన్ ఇదే....!

Update: 2018-07-28 03:43 GMT

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందని ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు వెల్లడించారు. కరుణానిధికి బీపీ, పల్స్ రేట్ డౌన్ అయిందని వైద్యులు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం కరుణానిధి ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు. కరుణానిధికి ఎనిమిది మంది డాక్టర్ల బృందం చికిత్స నందిస్తోంది. కావేరీ ఆసుపత్రిలో కరుణానిధికి చికిత్స అందిస్తున్నారు. గోపాలపురంలో ఆయన ఇంటిలోనే చికిత్స అందిస్తున్న కరుణానిధిని నిన్న అర్థరాత్రి కావేరి ఆసుపత్రికి తరలించారు. ఈరోజు కరుణానిధిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించనున్నారు.

అభిమానుల్లో ఆందోళన......

కరుణానిధి ఆరోగ్యం క్షీణించడంతో డీఎంకే నేతలు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమిళనాడు గవర్నర్ పురోహిత్, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఆసుపత్రికి చేరకుని కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకోనున్నారు. కరుణానిధి వయస్సు ప్రస్తుతం 94 ఏళ్లు. కావేరి ఆసుపత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో తాజాగా వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశముంది.

Similar News