బెదిరించిన కేసులో కాల్వ శ్రీనివాసులుకు?

ఎన్నికల అధికారులను బెదిరించిన కేసులో కాల్వ శ్రీనివాసులు కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు అనంతపురం కోర్టు చెప్పింది. కాల్వ శ్రీనివాస్ తమ [more]

Update: 2021-03-05 01:20 GMT

ఎన్నికల అధికారులను బెదిరించిన కేసులో కాల్వ శ్రీనివాసులు కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు అనంతపురం కోర్టు చెప్పింది. కాల్వ శ్రీనివాస్ తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంతో అధికారులను బెదిరించారన్న కేసు నమోదయింది. కాల్వ శ్రీనివాసులుతో పాటు మరో 24 మంది టీడీపీ మద్దతుదారులపై కేసు నమోదయింది. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కాల్వ శ్రీనివాసులు న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను అనంతపురం కోర్టు కొట్టివేసింది.

Tags:    

Similar News