చంద్రబాబు వద్దకు కడప పంచాయితి

కడప జిల్లాలోని రాజంపేట, జమ్మలమడుగు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నేతల మధ్య పంచాయితీ మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఈ రెండు నియోజకవర్గాల నేతలు ఇవాళ [more]

Update: 2019-01-22 06:23 GMT

కడప జిల్లాలోని రాజంపేట, జమ్మలమడుగు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నేతల మధ్య పంచాయితీ మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఈ రెండు నియోజకవర్గాల నేతలు ఇవాళ అమరావతిలో చంద్రబాబును కలవనున్నారు. జమ్మలమడుగులో వచ్చే ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి పోటీ చేస్తారా లేదా రామసుబ్బారెడ్డి బరిలో ఉంటారా ఇవాళ బాబు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

మేడా గోడ దూకుతారా?

ఇక, రాజంపేటలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి వ్యతిరేక వర్గం నేతలు చంద్రబాబును కలవనున్నారు. మేడా వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్నందున ఈ విషయాన్ని వారు సీఎం దృష్టికి తీసుకురానున్నారు. అయితే, ఈ సమావేశానికి మేడా మల్లిఖార్జున్ రెడ్డి హాజరుకావడం లేదు. అయితే, మల్లిఖార్జున్ రెడ్డి ధ్వంధ్వ వైఖరితో ఉన్నారని, ఆయన సోదరుడి ఒత్తిడితో ఆయన వైసీపీ వైపు మొగ్గుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. త్వరలోనే మల్లిఖార్జున్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయడమో, పార్టీనే ఆయనపై వేటు వేయడమో ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News