జూపల్లి ఎదురుతిరిగాడు

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన 20 మంది అభ్యర్థులను రంగంలోకి దించారు. గత ఎన్నికల్లో [more]

Update: 2020-01-17 04:59 GMT

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన 20 మంది అభ్యర్థులను రంగంలోకి దించారు. గత ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు. గెలిచిన హర్హవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత లభించింది. దీంతో జూపల్లి కృష్ణారావు తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దించారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జూపల్లిని పిలిచి మాట్లాడారు. కానీ ఆయన తాజాగా స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తుండటంతో టీఆర్ఎస్ అధిష్టానం జూపల్లి కృష్ణారావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News