పెద్దారెడ్డీ.. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచింది వైసీపీ పుణ్యమేనని అన్నారు. వైసీపీని చూసి ప్రజలు [more]

Update: 2021-07-29 07:04 GMT

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచింది వైసీపీ పుణ్యమేనని అన్నారు. వైసీపీని చూసి ప్రజలు ఓటు వేశారని, నిన్ను చూసి ఓటేయలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైసీపీలో తన అనుచరులు ఉన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఏ పార్టీలోకి ఎవరైనా వెళ్లే హక్కు ఉంటుందన్నారు. అనేక పార్టీల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఉన్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డికి గుర్తు చేశారు. నీ ఫేస్ ఒక సారి టర్నింగ్ ఇచ్చుకో అని ఎద్దేవా చేశారు. వైసీపీలో తన అనుచరులు ఉన్నమాట వాస్తవమేనని, అయితే వారితో తనకు సంబంధాలు లేవని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News