బ్రేకింగ్ : ఆ కేసును సీబీఐకి అప్పగించిన జగన్ ప్రభుత్వం

సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017లో కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి స్కూలులో సుగాలి ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇది [more]

Update: 2020-02-27 12:36 GMT

సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017లో కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి స్కూలులో సుగాలి ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇది ఆత్మహత్య కాదని అత్యాచారం చేసి చంపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కర్నూలుకు వచ్చిన జగన్ కు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు వినతి పత్రం అందజేశారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. దీంతో కొద్దిసేపటి క్రితం జగన్ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలులో భారీ ర్యాలి నిర్వహించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News