దాని కోసం ఏమైనా చేస్తా: జగన్

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అధిగమించేందుకు కేసీఆర్ ప్రతిపాదించిన జాతీయ కూటమి ఏర్పాటు స్వాగతించాల్సిన విషయమని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. [more]

Update: 2019-01-16 09:20 GMT

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అధిగమించేందుకు కేసీఆర్ ప్రతిపాదించిన జాతీయ కూటమి ఏర్పాటు స్వాగతించాల్సిన విషయమని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కేటీఆర్ తో భేటీ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ… ఫెడరల్ ఫ్రంట్, రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలు, రాష్ట్రాలు నిలబడాలంటే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావడం వంటి అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు.

హోదా కోసమే….

పార్లమెంట్ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ విషయంలోనే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. ఇటువంటి అన్యాయాలు అధిగమించాలంటే రాష్ట్రాల కోసం మాట్లాడే ఎంపీ సంఖ్య పెరగాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి 25 మంది ఎంపీలకు తెలంగాణలోని మరో 17 మంది ఎంపీలు తోడై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ ఫోన్ చేసి ఇదే అంశంపై మాట్లాడారని, ఇవాళటి సమావేశంలోనూ ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయని పేర్కొన్నారు. పార్టీలో చర్చించి, కేసీఆర్ ఏపీకి వచ్చి సమావేశమై చర్చించాక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News