ఐటీ గ్రిడ్ అశోక్ కోసం…??

ఐటీ గ్రిడ్ ఆశోక్ అండ్ టీంతో పాటు రవిప్రకాష్ శివాజి ల కోసం సైబరాబాద్ఆరు సెర్చ్ టిమ్స్ గాలిస్తున్నాయి. ఆరు టీంలు అత్యాదునిక ఆపరేషన్ ఈ సెర్చ్ [more]

Update: 2019-05-27 06:52 GMT

ఐటీ గ్రిడ్ ఆశోక్ అండ్ టీంతో పాటు రవిప్రకాష్ శివాజి ల కోసం సైబరాబాద్ఆరు సెర్చ్ టిమ్స్ గాలిస్తున్నాయి. ఆరు టీంలు అత్యాదునిక ఆపరేషన్ ఈ సెర్చ్ ఆపరేషన్ లో వాడుతున్నట్టు సమాచారం.. అశోక్ కు ఆశ్రమం ఇస్తున్న వారిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. రవిప్రకాష్ కు ఐడిగ్రిడ్ నేరస్తులకు ఇద్దరికి టీడీపీ ఆశ్రయం ఇస్తున్నట్లు పక్క సమాచారాన్ని సైబరాబాద్ పోలీసులు సేకరించారు.

మళ్లీ ఊపందుకున్న….

డేటా చోరీ వ్యవహారం లో ఐడిగ్రిడ్ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. అశోక్ కోసం వేటసిట్ ప్రత్యేక బృందాలు మొదలు పెట్టాయి. ఎల్బీనగర్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అశోక్ దరఖాస్తు చేశారు. అయితే బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసిన నేపధ్యంలో సెర్చ్ ఆపరేషన్ ముమ్మురం చేశారు. ఈ కేసులో సీజ్ చేసిన హార్డ్ డిస్కలను ఎఫ్ఎస్ఎల్ కు పంపిన రిపోర్టులు కూడా రావడంతో. ..టిడిపి కి చెందిన రాజకీయ నాయకులు కొందరు ప్రభుత్వ అధికారులకు సంబంధం ఉందని తేలింది.ఈ విషయాలు తేలాలంటే ఐటీ గ్రిడ్ అశోక్ ను అరెస్ట్ చేస్తే గాని స్పష్టత రాదని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు.

ఆశ్రయం కల్పిస్తున్న వారిపై కూడా….

నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నప్పుడు..వారికి ఆశ్రయం కల్పిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని ఉపయోగించేందుకు పోలీసులు ఇప్పటికే లిగల్ టీం నుండి అడ్వైజ్ తీసుకున్నారు. ఐటీ గ్రిడ్ వ్యవహారం లో ఇన్వాల్వ్ అయిన తెలుగుదేశం పార్టీ కు చెందిన సీనియర్ లీడర్ల పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం అయింది. టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ,శివాజీలకు ఇచ్చిన డెడ్ లైన్ కూడా దాటి పోవడం తో ఇద్దరిని ఏక్షణం ఆయినా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అయింది శివాజికి షెల్టర్ ఇస్తున్న టిడిపి నాయకులను ఇప్పటికే గుర్తించారు..ఆంద్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రాష్టాన్ని రోడ్డు మార్గం లో దాటిపోయిన రవిప్రకాష్ ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పొలిసులు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఫాలో అవుతున్నారు. తమను అరెస్ట్ చేయకుండా ఉండాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసుల లీగల్ టీం అప్రమత్తంగా ఉంది..

Tags:    

Similar News