కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఈయనేనట

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరనేది కాసేపట్లో తేలనుంది. బీజేపీ శాసనసభ పక్షం సమావేశమయింది. ఈ సమావేశంలో శాసనసభ పక్షనేతను ఎన్నుకోనున్నారు. కేంద్ర పరిశీలకులుగా మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ [more]

Update: 2021-07-27 13:48 GMT

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరనేది కాసేపట్లో తేలనుంది. బీజేపీ శాసనసభ పక్షం సమావేశమయింది. ఈ సమావేశంలో శాసనసభ పక్షనేతను ఎన్నుకోనున్నారు. కేంద్ర పరిశీలకులుగా మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డి వచ్చారు. అయితే అనేక మంది పేర్లు వినిపిస్తున్నా బసవరాజు బొమ్మై పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. బసవరాజు బొమ్మై ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. యడ్యూరప్ప కూడా బసవరాజు బొమ్మై పేరును ప్రతిపాదించారు. ఈయన కూడా లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఈయన పేరు ఖరారవుతుందంటున్నారు. 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందంటున్నారు. బసవరాజు బొమ్మై మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడు.

Tags:    

Similar News