సుప్రీంకోర్టుకు వెళతామన్న జగన్

పిల్లల భవిష్యత్ కోసం తాను పెడుతున్న పెట్టుబడి ఇది అని జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం వద్దనే వారు [more]

Update: 2020-05-27 07:14 GMT

పిల్లల భవిష్యత్ కోసం తాను పెడుతున్న పెట్టుబడి ఇది అని జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం వద్దనే వారు తమ పిల్లలను, మనవళ్లను ఎక్కడ చదవిస్తున్నారో చెప్పాలన్నారు. దీనికి అడ్డంపడానికి కొందరు కోర్టులను ఆశ్రయించి అడ్డంకులను సృష్టిస్తున్నారన్నారు. కోర్టు నిర్ణయం వెలువడగానే అందరి నలభై లక్షల మంది తల్లితండ్రుల అభిప్రాయం తీసుకున్నామని తెలిపారు. దాదాపు 96 శాతం మంది ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పారన్నారు. తెలుగును కంపల్సరీ చేస్తామని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్డుకు కూడా వెళుతున్నామని జగన్ చెప్పారు. పేదల తలరాతలు మారాలంటే ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాల్సిందేనని చెెప్పారు. దశల వారీగా ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెడతామని జగన్ వెల్లడించారు. ప్రతి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు జగన్ వెల్లడించారు. పాఠశాలల రూపు రేఖలనే మారుస్తామని చెప్పారు.

Tags:    

Similar News