వ్యాపారవేత్త సానా సతీష్ అరెస్ట్

ప్రముఖ పారిశ్రమికవేత్త సానా సతీష్ ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మొయిన్ ఖురేషి కేసు లో సతీష్ ని అరెస్ట్ చేసినట్లు [more]

Update: 2019-07-27 04:14 GMT

ప్రముఖ పారిశ్రమికవేత్త సానా సతీష్ ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మొయిన్ ఖురేషి కేసు లో సతీష్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సీబీఐ అధికారి ఆస్తానా ఫై సానా సతీష్ అవినీతి ఆరోపణలు చేశారు. పీఎంఎల్ఏ కేసు లో సానా సతీష్ ను ఢిల్లీ లో అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. సీబీఐ అధికారుల మధ్య వివాదానికి కారణమయిన హైదరాబాద్ కు చెందిన సతీష్ సానా..మటన్ వ్యాపారి మొయిన్ ఖురేషి మని లాండరింగ్ కేసు లో నిందితుడు. సానా సతీష్ రస్మా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పీ, గోల్డ్‌కోస్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాట్రిక్స్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈస్ట్ గోదావరి బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఆర్ఏఎస్ మెరైన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ గా పనిచేసిన రాకేష్ ఆస్తానా రెండు కోట్ల లంచం అడిగారని ఆరోపణలు చేసి సీబీఐ లో రచ్చ లేపారు సానా సతీష్

Tags:    

Similar News