బ్రేకింగ్: పాకిస్థాన్ కు భారీ షాక్ ఇచ్చిన భారత్

పుల్వామా ఉగ్రదాడితో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్… పాకిస్థాన్ కు భారీ షాక్ ఇచ్చింది. భారత్ మీదుగా పాకిస్థాన్ కు వెళుతున్న సింధూ నీటిని ఆపేసింది. ఈ నీటిని [more]

Update: 2019-02-21 13:46 GMT

పుల్వామా ఉగ్రదాడితో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్… పాకిస్థాన్ కు భారీ షాక్ ఇచ్చింది. భారత్ మీదుగా పాకిస్థాన్ కు వెళుతున్న సింధూ నీటిని ఆపేసింది. ఈ నీటిని పాకిస్థాన్ కు సరఫరా చేయడం నిలిపివేసి కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు మళ్లించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నదని ఆయన పేర్కొన్నారు. 1960 సెప్టెంబర్ 19వ తేదీన వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి సుమారు 80 శాతం సింధూ నీటిని పాకిస్థాన్ వినియోగించుకుంటోంది. ఈ నీటితో పాక్ తాగు, సాగు అవసరాలకు వినియోగించుకుంటోంది.

పుల్వమా దాడితో…

పాక్ లో సుమారు 60 శాతం పంటలు సింధూ జలాల ద్వారా పండుతాయి. ఈ నీరు పాకిస్థాన్ కు చాలా కీలకం. సింధూ నీరు పాక్ కు నిలిపివేయడం ద్వారా అక్కడ కరువు తాండవించే అవకాశం ఉంటుంది. పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ పై సీరియస్ గా ఉన్న భారత్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాక్ కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను భారత్ వినియోగించుకున్న విషయం తెలిసిందే. పాక్ పై యుద్ధం కాకుండా నీరు ఆపేయడం ద్వారా ఆ దేశానికి భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది.

Tags:    

Similar News