మళ్లీ పెరుగుతున్నాయి.. తెలంగాణలో దాని ఫలితమేనా?

తెలంగాణ నిన్న ఒక్కరోజే 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు నాలుగైదు రోజుల నుంచి 11 లోపే కేసులు నమోదు అవతుండటంతో అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. [more]

Update: 2020-05-10 02:55 GMT

తెలంగాణ నిన్న ఒక్కరోజే 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు నాలుగైదు రోజుల నుంచి 11 లోపే కేసులు నమోదు అవతుండటంతో అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. అయితే శనివారం ఒక్కరోజే 31 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. ఇందులో 30 కేసులు గ్రేటర్ హైదరాబాద్ లోనివే. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1163కు చేరుకున్నాయి. దాదాపు ఇరవై రోజుల తర్వాత కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కొన్ని వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడం వల్లనే కేసుల సంఖ్య పెరుగుతున్నాయన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News