గుంటూరులో అలా గుర్తిస్తే వెయ్యి జరిమానా

గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు 51 కు చేరుకున్నాయి. కర్నూలు తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదయిన జిల్లా గుంటూరు. దీంతో జిల్లా అధికారులు ఇక్కడ కఠిన [more]

Update: 2020-04-10 04:20 GMT

గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు 51 కు చేరుకున్నాయి. కర్నూలు తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదయిన జిల్లా గుంటూరు. దీంతో జిల్లా అధికారులు ఇక్కడ కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. కరోనాతో నరసరావుపేట ప్రాంతంలో ఒకరు మరణించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ హెచ్చరించారు. మాస్క్ లేకుండా బయటకు వస్తేవెయ్యిరూపాయలు జరిమానా విధించారు. ఏపీలో జరిమానాలు విధించిన జిల్లాగా గుంటూరు తో మొదలయింది. ఇప్పటికే నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు.

Tags:    

Similar News