నేటి నుంచి వీరందరికీ ఏపీలో పనే?

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి లాక్ డౌన్ ను కొన్ని ప్రాంతాల్లో కొన్ని రంగాల్లో సడలింపులు చేశారు. నేటి నుంచి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ [more]

Update: 2020-04-20 01:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి లాక్ డౌన్ ను కొన్ని ప్రాంతాల్లో కొన్ని రంగాల్లో సడలింపులు చేశారు. నేటి నుంచి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ సంబంధ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు. పండ్లు, కూరగాయల బండ్లను రోడ్లపైకి అనుమతిస్తారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా నేట ినుంచి పనిచేయనున్నాయి. అన్ని ఆసపత్రులకు అనుమతులు ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణ పనులకు ఉపాధి హామీ పథకానికి జత చేసి తిరిగి ప్రారంభించనున్నారు. చిన్న వృత్తుల వారు తమ పనులను చేసుకునే వీలుంది. హైవేలో దాబాలకు అనుమతి ఇచ్చారు. అక్కడ పార్శిల్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. బేకరీలు కూడా నేటి నుంచి తెరుచుకోనున్నాయి. అయితే రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో మాత్రం వీటికి అనుమతి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగానే లాక్ డౌన్ లో మినహాయింపులు ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags:    

Similar News