ఐకియా....క్యా....కియా....!

Update: 2018-08-11 12:42 GMT

పిచ్చి పరాకాష్టకు చేరింది. ఎక్కడైనా కొత్త స్టోర్ వెలిసిందంటే క్యూ కట్టేయడమే. ఏదైనా ఫ్యాక్టరీ సేల్ తగ్గింపు ధరకు అంటే చాలు...పనులు మానుకుని...సెలవులు పెట్టి మరీ తక్కువ ధరకు తెచ్చుకోవడానికి లైన్లో నిలబడతారు. ఏదైనా రెండు తెలుగురాష్ట్రాల్లో ఇది మామూలే. తాజాగా హైదరాబాద్ లో స్వీడన్ కు చెందిన ఐకియా ఫర్నిచర్ స్టోర్ ప్రారంభమయింది. దాదాపు 14 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. అయితే తొలిరోజు భారీ డిస్కైంట్లు ఉంటాయని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఇంక చెప్పాల్సిన పనుందా...? తిరుపతిని తలపించింది ఐకియా స్టోర్.

 

సోషల్ మీడియాలో సెటైర్లు.....

హైదరాబాద్ లో తాజాగా ప్రారంభమైన ఐకియా స్టోర్ తొలిరోజే నలభై వేల మంది సందర్శకులతో కళకళ లాడింది. దీంతో హైటెక్ సిటీ రోడ్డు మొత్తం జామ్ అయింది. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఈ జనాల్ని చూసి సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పేలుతున్నాయి. దేవుడ్నిచూడటానికి వచ్చినట్లుంది అని ఒకరంటే....తిరుపతి క్యూని మరిపిస్తోందని మరోనెటిజన్ అభిప్రాయపడ్డారు. తిరుపతి లడ్డూల కోసం హైదరాబాదీలు క్యూ కట్టారని మరొకరు సెటైర్ వేశారు. ఇలా ఐకియా స్టోర్ కు వచ్చిన జనసందోహాన్ని చూసి సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

Similar News