హాట్ స్పాట్ గా హైదరాబాద్… ఇక్కడే సమస్య

హైదరాబాద్ కరోనా కు హాట్ స్పాట్ గా మారింది. నిన్న ఒక్కరోజే హైదరాబాద్ నగరంలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 40 కేసులు [more]

Update: 2020-04-08 02:26 GMT

హైదరాబాద్ కరోనా కు హాట్ స్పాట్ గా మారింది. నిన్న ఒక్కరోజే హైదరాబాద్ నగరంలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 40 కేసులు నమోదయ్యాయి. అందులో హైదరాబాద్ లోనే 17 కేసులున్నాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404కు చేరుకుంది. హైదరాబాద్ లో ఈ కేసుల సంఖ్య 150గా ఉంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 11 మంది చనిపోయారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో అధికశాతం మర్కజ్ మసీదు ప్రార్థనలో పాల్గొన్నవారు, వారి కుటుంబ సభ్యులే.

Tags:    

Similar News