గుబులు రేపుతున్న ఓటింగ్ శాతం

హుజూర్ నగర్ ఉపఎన్నికల తరువాత నేతల్లో టెన్షన్ పెరిగిపోయింది. ఓటింగ్ శాతం పెరగడంతో అది ఎవరికి లాభమో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. పెరిగిన ఓటింగ్ శాతం తమకు [more]

Update: 2019-10-23 10:30 GMT

హుజూర్ నగర్ ఉపఎన్నికల తరువాత నేతల్లో టెన్షన్ పెరిగిపోయింది. ఓటింగ్ శాతం పెరగడంతో అది ఎవరికి లాభమో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. పెరిగిన ఓటింగ్ శాతం తమకు కలిసొస్తుందని టిఆర్ఎస్ అంటుంటే, ఆ ఓటింగ్ తమకే లాభిస్తుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో రెండు పార్టీల నాయకులు ఓటింగ్ శాతాలపై లెక్కలేసుకుంటున్నారు

కొన్ని గంటల్లోనే…..

హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లోనే వెలువడనున్నాయి. కాని అంతవరకు పార్టీల క్రియాశీలక నేతలు ఉండలేకపోతున్నారు. ఏ క్షణం ఏమవుతుందో తెలియక అనుచరులతో ఓటింగ్ సరళిపై విశ్లేషిస్తున్నారు. ఎగ్జిట్ పోల్ అంచనాలు అధికారపార్టీకే అనుకూల పవనాలు వీస్తున్నాయని తేల్చాయి. దీంతో టి.ఆర్.ఎస్ శ్రేణులు కొంత భరోసాగా ఉన్నా లోలోన మాత్రం భయంగా ఉంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం సర్వేలను పట్టించుకోకుండా పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలిస్తుందని అంచనాలు వేస్తున్నారు

లెక్క తేలేనా…..

ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల గ్రామీణ ప్రాంతాల ఓటర్లు టి.ఆర్.ఎస్ పార్టీవైపే మొగ్గుచూపారని ఆ పార్టీ నాయకులు లెక్కలేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు విస్రృతంగా ప్రచారంచేయడం, తండాల్లో ఓట్లు అధికారపార్టీకే పడ్డాయని ఊహిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అనేక వర్గాల వారు కాంగ్రెస్ పక్షాన నిలిచారని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె, తాము చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయనే ధీమాలో కాంగ్రెస్ ఉంది.

 

 

Tags:    

Similar News