మరి టీవీల్లో చూపించొచ్చు కదా..?

Update: 2018-07-24 14:30 GMT

టీటీడీ ఆగస్టు 9 నుండి 17 వరకు నిర్వహిస్తున్న మహా సంప్రోక్షణ పై హైకోర్టు లో మంగళవారం విచారణ జరిగింది. మహా సంప్రోక్షణ జరుగుతున్న సమయంలో దర్శనానికి ప్రజలకు అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. మహా సంప్రోక్షణ జరుగుతున్న కార్యకమాన్ని మొత్తం టీవీ లో ప్రసారం చేయాలని పిటిషనర్ కోరారు. .2006 లో మహా సంప్రోక్షణ జరిగినప్పుడు ప్రజలకు అనుమతి ఇచ్చారని, మరి ఇప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. మహా సంప్రోక్షణ మీద ఆగమ శాస్త్రం ఏం చెబుతుందో కోర్టుకు తెలపాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. ప్రజలను కంట్రోల్ చేయలేనప్పుడు అన్ని టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయవచ్చు కదా, ఎందుకు చేయకూడదని టీటీడీని హైకోర్టు ప్రశ్నించింది. ఆగమ శాస్త్ర అడ్వైజర్ కమిటీ పూర్తి వివరాలను ఈ నెల 26న కోర్టుకు తెలపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Similar News