ఇంటర్ ఫలితాల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకల వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, దీంతో 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ [more]

Update: 2019-04-23 11:55 GMT

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకల వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, దీంతో 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు ఇంటర్ బోర్డును తీవ్రంగా తప్పుపట్టింది. పరీక్షల్లో ఫెయిల్ అయిన మూడున్నర లక్షల మంది విద్యార్థుల పేపర్లను రివాల్యువేషన్ చేయగలరా అని కోర్టు ప్రశ్నించింది. అయితే, ఇది ప్రతి సంవత్సరం జరిగేదే అని, మూడున్నర లక్షల మంది పేపర్లు రీవాల్యువేషన్ చేయాలంటే రెండు నెలల సమయం పడుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి కోర్టుకు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 9 లక్షల మంది పెపర్లు వాల్యువేషన్ చేయడానికి నెల రోజుల సమయం పడితే మూడున్నర లక్షల మంది పేపర్లు రీవాల్యువేషన్ చేయడానికి రెండు నెలలు ఎందుకు పడుతుందని కోర్టు ప్రశ్నించారు. ఫెయిల్ అయిన వారి పేపర్లు రీవాల్యువేషన్ చేసి ఫలితాలు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో సోమవారం లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించి తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News