ఆ కేసును సీబీఐకి

వివిధ సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం సీఐడీ ఈ కేసులపై విచారణ చేస్తున్నప్పటికీ సీబీఐ స్వతంత్ర [more]

Update: 2020-10-09 02:15 GMT

వివిధ సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం సీఐడీ ఈ కేసులపై విచారణ చేస్తున్నప్పటికీ సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావడంతో దానికే అప్పగించడం మేలని తెలిపింది. ఇది సీఐడీకి కూడా మేలు చేస్తుందని చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించిన మాత్రాన సీఐడీపై నిందలు మోపినట్లు కాదని హైకోర్టు తెలిపింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు.

Tags:    

Similar News