ఆ జీవోను 24 గంటల్లో ప్రజలముందుంచండి.. హైకోర్టు ఆదేశం

వాసాల మర్రిలో దళితబంధు పధకం అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలను ఖరారు చేయకుండానే పథకాన్ని వర్తింప చేశారని పిటీషన్ ఆరోపించారు. అయితే దీనికి దళితులందరూ అర్హులేనని [more]

Update: 2021-08-18 08:01 GMT

వాసాల మర్రిలో దళితబంధు పధకం అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలను ఖరారు చేయకుండానే పథకాన్ని వర్తింప చేశారని పిటీషన్ ఆరోపించారు. అయితే దీనికి దళితులందరూ అర్హులేనని అడ్వొకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. ప్రతి ఒక్క దళిత కుటుంబం ఈ పథకానికి అర్హులేనని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. నిబంధనలను ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే నిబంధనలను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుడల చేసిన జీవో వెబె సైట్ లో లేదని పిటీషన్ తరుపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. జీవోను 24 గంటల్లో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News