పరీక్షలపై పునరాలోచించుకోవడమే మంచిది.. హైకోర్టు సూచన

పరీక్షలపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోరింది. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలంటూ రెండు పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారించిన హైకోర్టు కరోనా పరిస్థితుల [more]

Update: 2021-05-01 00:41 GMT

పరీక్షలపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోరింది. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలంటూ రెండు పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారించిన హైకోర్టు కరోనా పరిస్థితుల దృష్ట్యా దీనిపై పునరాలోచించుకోవాలని కోరింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపింది. లక్షలాది మంది విద్యార్థుల జీవితానికి సంబంధించిన విషయమని హైకోర్టు అభిప్రాయపడింది. పొరుగు రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేస్తే మీరు ఎలా నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఇంటర్ పరీక్షలు మే 5వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News