వారి డిమాండ్లను పరిష్కరించలేం

హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయని, పరిధులు దాటి ముందుకు వెళ్లలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విషయాన్ని కార్మిక సంఘ న్యాయస్థానానికి పంపుతామని, అదే పరిష్కరిస్తుందని హైకోర్టు పేర్కొంది. ఆర్టీసీ సమ్మెను [more]

Update: 2019-11-18 11:11 GMT

హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయని, పరిధులు దాటి ముందుకు వెళ్లలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విషయాన్ని కార్మిక సంఘ న్యాయస్థానానికి పంపుతామని, అదే పరిష్కరిస్తుందని హైకోర్టు పేర్కొంది. ఆర్టీసీ సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం ఈ వాదనను విన్పించింది. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత కార్మికులు ఆరు వారాలు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం కోసం వేచిచూడాలని, అయితే అదేమీ లేకుండా సమ్మెకు వెళ్లారని ఇది పారిశ్రామిక చట్టాల ప్రకారం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో కొన్ని కేసులను ఈ సందర్భంగా ఉదహరించారు. తాము ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష‌్కరించలేమని కూడా ప్రభుత్వం కోర్టుకు వివరించింది. విలీనం డిమాండ్ ను యూనియన్లు తాత్కాలికంగా మాత్రమే పక్కన పెట్టాయని పేర్కొంది. ఇప్పటికే ఆర్టీసీ 44 శాతం నష్టపోయినట్లు పేర్కొంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు యూనియన్లు ప్రయత్నిస్తాయని, సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలని హైకోర్టును కోరింది.

Tags:    

Similar News