ఎనభై కోట్ల ఆస్తుల జప్తు.. ఈడీ దూకుడు

హీరా గోల్డ్ కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది . ప్రజల దగ్గర నుంచి దోచుకున్న డబ్బులతో కూడబెట్టుకున్న ఆస్తులను ఈడీ స్వాధీన పరచుకుంది. హీరా గోల్డ్ [more]

Update: 2020-08-08 08:17 GMT

హీరా గోల్డ్ కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది . ప్రజల దగ్గర నుంచి దోచుకున్న డబ్బులతో కూడబెట్టుకున్న ఆస్తులను ఈడీ స్వాధీన పరచుకుంది. హీరా గోల్డ్ పేరుమీద ఉన్న ఆస్తులను ఈడీ అటాచ్మెంట్ చేస్తుంది. హీరా గోల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది..నౌహీరా షేక్ సంబంధించిన ఆస్తులను ఒక్కొక్కటిగా అటాచ్ మెంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇందులో భాగంగా ఇవాళ టోలిచౌకి లో కంపెనీకి సంబంధించిన ఫ్లాట్ లను స్వాధీన పరుచుకుంది. టోలి చౌకి లోని ఎం ఎస్ సి కాలనీ లో ఉన్న మొత్తం 81 ఫ్లాట్లలను సీజ్ చేసింది. వీటి విలువ దాదాపు 80 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి ఆస్తులను కూడా పెట్టుకున్నారన్న ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు . దీంతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 60కి పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో హీరా గోల్డ్ చైర్మన్ నౌ హీర షేక్ చారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు.. ఈ తరుణంలోనే హీరా గోల్డ్ పైన ఈడి కేసు నమోదు చేసింది.. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అయితే ఇప్పటికే దాదాపు 300 కోట్ల పైచిలుకు ఆస్తులను ఈడి అటాచ్ మెంట్ చేసింది. తాజాగా ఇవాళ 80 కోట్ల రూపాయల పై చిలుకు ఆస్తులను అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఆరు వందల కోట్ల రూపాయల ఆస్తులను కూడా ఈడి అటాచ్ చేయబోతుంది.

Tags:    

Similar News