నేడు మేయర్ ఎన్నిక… సీల్డ్ కవర్ లో పేర్లు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నేడు జరగనుంది. ఈరోజు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణస్వీకారంచేస్తారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. జీహెచ్ఎంసీలో [more]

Update: 2021-02-11 01:18 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నేడు జరగనుంది. ఈరోజు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణస్వీకారంచేస్తారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. జీహెచ్ఎంసీలో 149 మంది కార్పొరేటర్లతో పాటు 33 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. టీఆర్ఎస్ కే 32 మంది ఎక్ అఫిషియో సభ్యులు ఉన్నారు. 56మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం సీల్డ్ కవర్ లో పంపనుంది. ఈ ఎన్నిక పరిశీలకులుగా మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్ తో పాటు రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావును నియమించారు. మేయర్ ఎవరనేది మరికాసేపట్లో తేలనుంది.

Tags:    

Similar News