ఆర్టీసీలో కొత్త నియామకాలపై ప్రభుత్వం కసరత్తు

ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. దసరా పండుగకు హైదరాబాద్ నుంచి ప్రయాణికులు వారివారి ఊర్లకు వెళ్లినప్పటికి తిరుగు ప్రయాణంలో వారికి ఏ [more]

Update: 2019-10-09 16:19 GMT

ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. దసరా పండుగకు హైదరాబాద్ నుంచి ప్రయాణికులు వారివారి ఊర్లకు వెళ్లినప్పటికి తిరుగు ప్రయాణంలో వారికి ఏ విధమైన ఇబ్బందులు రావొద్దని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మరో వైపు ఆర్టీసీలో కొత్త నియామకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను నియమించుకుని వారితో బస్సులను నడిపితే ఎలా ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు అధికారులు సమీక్ష నిర్వహించారు. డిపో మేనేజర్లు, ఆర్టీసీలో ఇతర ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఎక్కడెక్కడ ఎటువంటి ఏర్పాట్లు కావాలి, ఎంతమంది సిబ్బంది కావాలనే దానిపై వివరాలు సేకరించారు.

 

Tags:    

Similar News