విజయ్ రూపానీ ఇలా కూడా చేస్తారా?

Update: 2018-05-24 12:02 GMT

వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వరుణదేవుడి కటాక్షం కోసం యాగాలు నిర్వహించాలని నిర్ణయించింది గుజరాత్ ప్రభుత్వం. విజయ్ రూపానీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, నగరాల్లో మొత్తం 41 చోట్ల ఈ వరుణ యాగాలు జరిపించాలని నిర్ణయించింది. మే 31న ఈ యాగాలు జరగనున్నాయి. అయితే, చెరువుల్లో పూడిక తీసేందుకు ఉద్దేశించిన జల్ అభియాన్ (తెలంగాణలో మిషన్ కాకతీయ లా) కార్యక్రమం కిందనే ఈ యాగాలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు ఈ యాగాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారంట. అయితే, మంత్రాలకు చింతకాయలు రాలకున్నా ఎవరికీ ఏమీ బాధ లేదు కానీ, ప్రభుత్వం చేసే ఈ యాగాలకు వర్షాలైనా కురిస్తే బాగుండు. ఇప్పటికే గుజరాత్ లో అధిక ఉష్ణోగ్రతలు, భూగర్భ జలాలు లేక ప్రజలు అల్లాడుతున్నారు.

Similar News