ఎనిమిది వేల మంది రాసి ఒక్కరూ పాస్ అవ్వలేదు...

Update: 2018-08-22 10:50 GMT

గోవాలో అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ప్రభత్వం నిర్వహించిన పరీక్ష ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పరీక్షకు ఎనిమిది వేల మంది అభ్యర్థులు హాజరై రాశారు. డిగ్రీ అర్హతతో కూడిన ఈ పరీక్షలో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అకౌంట్స్ కి సంబంధించిన ప్రశ్నలతో 100 మార్కులతో ఐదు గంటల సమయం కేటాయించి నిర్వహించారు. ఇందులో 50 మార్కులు సాధించిన వారు రెండో రౌండ్(ఇంటర్వ్యూ)కి అర్హులు. ఇంటర్వ్యూలో కూడా ఉత్తీర్ణ సాధిస్తే జాబు వచ్చినట్లే. అయితే, జనవరి 7న జరిగిన ఈ పరీక్ష ఫలితాలు ఆలస్యంగా విడుదలయ్యాయి.

ప్రభుత్వ నిర్లక్షమే కారణమన్న ఆప్

తీరా చూస్తే ఒక్కరంటే ఒక్క అభ్యర్థి కూడా 50 మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించలేదు. ఇంగ్లీష్, జీకే లో కొంతమంది మంచి మార్కులే సాధించినా అకౌంట్స్ లో మాత్రం అభ్యర్థులంతా వెనకబడ్డారు. దీంతో నివ్వెరపోవడం అధికారుల వంతయింది. అయితే, గత అక్టోబరులో వచ్చిన నోటిఫికేషన్ కు ఇంత ఆలస్యంగా ఫలితాలు ఇచ్చారని, ఆలస్యం వల్లే ఇలా జరిగిందని, గోవా విశ్వవిద్యాలయానికి, అనుబంధ కామర్స్ కళాశాలలకు ఇది ఎంతో అప్రతిష్ఠ అని ఆరోపిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ గోవా జనరల్ సెక్రటరీ ప్రదీప్ పడ్గాంకర్. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆయన విమర్శించారు.

Similar News