గవర్నర్ కు దూరంగా బాబు...ఎందుకంటే....?

Update: 2018-11-11 05:54 GMT

మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన గవర్నర్ నరసింహన్ ను ప్రత్యేకంగా కలుసుకునేందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తి చూపలేదు. విజయవాడ వచ్చిన గవర్నర్ నేరుగా గేట్ వే హోటల్ కు వెళ్లారు. సాధారణంగా గవర్నర్ వస్తే ప్రతిసారీ చంద్రబాబు గవర్నర్ తో భేటీ అయ్యేవారు. ప్రతి సారీ కలిసి ఆయనతో రాష్ట్ర సమస్యలపై చర్చించేవారు. కానీ ఈసారి గవర్నర్ వద్దకు చంద్రబాబు రాలేదు.

జగన్ పై దాడి ఘటనలో....

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాత్రమే గవర్నర్ కు స్వాగతం పలికేందుక వచ్చారు. జగన్ పై హత్యాయత్నం కేసులో గవర్నర్ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థపై కూడా ఆయన ధ్వజమెత్తారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగనట్లే కన్పిస్తోంది. ప్రతి మంత్రి వర్గ విస్తరణకు ముందు గవర్నర్ తో భేటీ అయి వారి పేర్లు, ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకుంటుందీ వివరించే ముఖ్యమంత్రి ఈసారి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.

Similar News