షర్మిల, విజయమ్మలపై కేసులో కొత్త ట్విస్ట్

వైఎస్ షర్మిల, విజయమ్మలపై పరకాల కేసు ఉపసంహరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పరకాలలో 2012 అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని వీరిద్దరిపై కేసు నమోదయింది. ప్రజా ప్రతినిధుల [more]

Update: 2021-03-27 00:57 GMT

వైఎస్ షర్మిల, విజయమ్మలపై పరకాల కేసు ఉపసంహరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పరకాలలో 2012 అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని వీరిద్దరిపై కేసు నమోదయింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో విజయమ్మ, షర్మిళ, కొండా సురేఖ, కొండా మురళీపై విచారణ జరుగుతోంది. అయితే ప్రాసిక్యూషన్ ఉపసంహరణ పిటిషన్ వేయనున్నట్లు కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. సంబంధిత అధికారుల ఉత్తర్వుల కోసం రావాల్సి ఉందని మెమో దాఖలు చేశారు. కేసును ఎక్కువ రోజులు వాయిదా వేయలేమన్న ప్రజాప్రతినిధుల కోర్టు చెప్పింది. విజయమ్మ, షర్మిళపై మాత్రమే కేసు ఉపసంహరించే ఉద్దేశం కనిపిస్తోందన్న కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేసును త్వరగా తేల్చాల్సి ఉందన్న కోర్టు తెలిపింది. ఈనెల 31న విజయమ్మ, షర్మిళ సహా నిందితులందరూ హాజరు కావాలన్న కోర్టు చెప్పింది.

Tags:    

Similar News