బ్రేకింగ్ : సినీనటుడు గొల్లపూడి కన్నుమూత

సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతి చెందారు. చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గొల్లపూడి మారుతీరావు మరణించారు. గొల్లపూడి మారుతీరావు మరణంతో టాలివుడ్ లో [more]

Update: 2019-12-12 08:01 GMT

సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతి చెందారు. చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గొల్లపూడి మారుతీరావు మరణించారు. గొల్లపూడి మారుతీరావు మరణంతో టాలివుడ్ లో విషాదం అలుముకుంది. రచయిత, నటుడు, వ్యాఖ్యాతగా గొల్లపూడి మారుతీరావు పేరుగడించారు. 1939లో గొల్లపూడి మారుతీరావు విజయనగరం జిల్లాలో జన్మించారు. దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించారు. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఉత్తమ రచయితగా పురస్కారాన్ని అందుకున్నారు. గొల్లపూడికి ముగ్గురు కుమారులు. తన 14 వ ఏటనే ఆశాజీవి అనే కథను రాశారు. విశాఖపట్నం అంటే గొల్లపూడి మారుతీరావుకు ఎనలేని ప్రేమ. ఆరు నంది పురస్కారాలను గొల్లపూడి అందుకున్నారు.

Tags:    

Similar News