భక్తి ముసుగులో రూ.50 కోట్ల మోసం

Update: 2018-12-24 14:24 GMT

భక్తి ముసుగులో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాన్ని రాచకొండ పోలీసులు గుట్టు విప్పారు. తెలుగు రాష్ట్రల్లో ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేసిన ఓ స్వామీజి పూజలు, భక్తి ప్రవచనాల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ.. తమ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పేవాడు. దీంతో అతని మాటలు నమ్మిన కొంతమంది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసపోయారు. తెలుగు రాష్ట్రల్లో బాధితుల నుండి 50 కోట్ల వరకు వసూలు చేసి ప్రజలను నిలువునా ముంచాడు. నెల్లూరు కు చెందిన గీరష్ చదివింది ఇంటర్. కానీ ఆధ్యాత్మిక విధ్యను నేర్చుకున్న గిరిష్... ప్రజలకు చేరువయ్యడు. పూజల పేరుతో నిర్వహించే కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో ఫీజుల కింద వసూలు చేశాడు. అంతే కాకుండా.. పూజల పేరుతో వచ్చిన డబ్బును స్టార్టప్ పేరుతో 30 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశాడు. వందల మంది ఇంజనీరింగ్ విద్యార్థులను ఉపాది పేరుతో కొన్ని యాప్స్ డెవలప్మెంట్, స్టార్టప్ కంపెనీలలో ఉద్యోగాల్లో చేర్చుకున్నాడు. తన వద్దకు వచ్చిన వారికి నమ్మకం కలిగేలా కొన్ని కంపెనీలను పరిచయం చేశాడు.

రూ.2 కోట్ల ఖర్చుతో వివాహం

పూజల ద్వారానే కాకుండా.. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే రెట్టింపు ఆదాయం పొందవచ్చని ఆశ చూపాడు. దీంతో అతని మాటలు నమ్మిన కొంతమంది అతని కంపెనీలో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. రోజులు, నెలలు గడుస్తున్నా పెట్టిన పెట్టుబడికి ఫలితం రాకపోవడంతో మోసపోయమని గ్రహించిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయిచింది. దీంతో ఆధ్యాత్మిక ప్రవచనాలు, పూజలు, షెల్ కంపెనీల పేరుతో చేస్తున్న మోసాలను రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. ఇప్పటివరకు బాదితుల నుండి సుమారు 50 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని జాయింట్ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ప్రజల నుండి వసూలు చేసిన డబ్బుతో విదేశీ టూర్లల్లో ఎంజాయి చేశాడని... కోటి నుండి రెండు కోట్ల వరకు ఖరీదైన కార్లను కొనుగోలు చేసి జల్సాలు చేశాడన్నారు. ఇటీవల దివ్య అనే అమ్మాయిని రామెజీ పిలిం సిటిలో వివాహం చేసుకున్నాడు. తన వివాహనికి రెండు కోట్లు ఖర్చు పెట్టినట్లు విచారణలో తేలిందన్నారు. అతను 30 షెల్ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నట్లు రిజిస్టేషన్ చేసుకున్నాడని.. కాని ఒక్క కంపెనీలో కూడా ఎలాంటి పనులు చెపట్టలేదన్నారు. ఇతని మాయలో పడి ప్రజలు మోసపోవడమే కాకుండా... నిరుద్యోగ యువత కూడా స్టార్టప్ కంపెనీలు మంచి జీతాలు వస్తామని నమ్మి రెండు సంవత్సరాలు పనిచేశారని... కానీ జీతాలు ఇవ్వకుండా మోసం చేయడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

Similar News