హీరోకి షాక్ ఇచ్చిన జి హెచ్ ఎం సి

అధికారం చేతిలో లేకపోతే బడాబాబులకు సినిమా కష్టాలే. దీనికి సినీ హీరోలు అతీతులు కాదని అనేక సందర్భాల్లో నిరూపితం అయ్యింది. తాజాగా హీరో నందమూరి తారక రత్నకు [more]

Update: 2019-02-05 02:59 GMT

అధికారం చేతిలో లేకపోతే బడాబాబులకు సినిమా కష్టాలే. దీనికి సినీ హీరోలు అతీతులు కాదని అనేక సందర్భాల్లో నిరూపితం అయ్యింది. తాజాగా హీరో నందమూరి తారక రత్నకు షాక్ ఇచ్చింది హైదరాబాద్ జి హెచ్ ఎంసీ. ఆయనకు సంబంధించిన బంజారాహిల్స్ లో వున్న రెస్టారెంట్ ను కూల్చేశారు జి హెచ్ ఎంసీ అధికారులు. రోడ్డు పై అడ్డంగా ఆక్రమించిన రెస్టారెంట్ నిర్మాణాలు ప్రోక్రెయినర్లు వచ్చి కూల్చేస్తుంటే విషయం తెలిసి అక్కడికి వచ్చినా ఏమి చేయలేక హీరో తారకరత్న నిస్సహాయకుడు అయిపోయారు. ఈ రెస్టారెంట్ ను ఆయన లీజు కు ఇచ్చారు.

స్థానికుల ఫిర్యాదుతో కొంప మునిగింది …

జి హెచ్ ఎం సీ తారకరత్న రెస్టారెంట్ నే ఎందుకు టార్గెట్ చేశారంటే పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు రాజకీయంగా వున్న పలుకుబడి ఇప్పుడు తెలంగాణ లో టిడిపికి లేకపోవడంతో నందమూరి, నారా కుటుంబాలకు భాగ్యనగరంలో చిక్కులు ఎదురు అవుతున్నాయి. రాజకీయ అండ దండలతో ఇంతకాలం కాలం చెల్లింది. ఇప్పుడు టి సర్కార్ జమానాలో చుక్కలు కనిపిస్తున్నాయి పలువురి బడా బాబులకు. గత కొంత కాలంగా అర్ధరాత్రి వరకు తప్పతాగిన వారు ఈ రెస్టారెంట్ లో చేస్తున్న అరాచకాలు డిజె సౌండ్స్ నిద్రలేని రాత్రులను మిగల్చడంతో బాటు చుట్టుపక్కల ఇళ్లముందు వాహనాలు అడ్డదిడ్డంగా పార్క్ చేయడంతో చెప్పి చెప్పి విసుగెత్తిన స్థానికులు నేరుగా కార్పొరేషన్ కి ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పలువురి నుంచి వత్తిడులు వచ్చినా తమ కర్తవ్యం నెరవేర్చడంలో వెనుకడుగు వేయలేదు. సామాన్యుల నిర్మాణాలు ఎలా కూలుస్తారో అదే రకంగా హీరో తారకరత్న రెస్టారెంట్ కూల్చి మినహాయింపులు లేవని చాటి చెప్పి జనంలో జేజేలు పొందడం విశేషం.

Tags:    

Similar News