కాంగ్రెస్ లోకి గద్దర్..?

Update: 2018-10-12 06:55 GMT

ప్రజాగాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆయన రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు. ప్రజలు కోరితే కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ లో అయనా పోటీ చేస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి గద్దర్ ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని తెలుస్తోంది. అయితే, రాహుల్ సమక్షంలో గద్దర్ కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. కానీ, అటువంటిదేమీ లేదని, ఓ ఫౌండేషన్ కు సంబంధించిన వినతిపత్రం రాహుల్ గాంధీకి ఇవ్వడానికి గద్దర్ ఢిల్లీ వేళ్లారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి ఆయన కాంగ్రెస్ లో చేరతారా లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ మద్దతు తీసుకుంటారా..? అనేది త్వరలోనే తేలనుంది. గద్దర్ కుమారుడు సూర్య కిరణ్ గత ఏప్రిల్ లో కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. సూర్యకిరణ్ పెద్దపల్లి లోక్ సభ నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు.

Similar News