Uttam : కౌశిక్ రెడ్డి బంధువే… కానీ ఆయన…?

కౌశిక్ రెడ్డి తనకు బంధువేనని, అయితే ఆయన పార్టీ వీడటానికి, తనకు సంబంధం లేదని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బల్మూర్ వెంకట్ [more]

Update: 2021-11-13 13:14 GMT

కౌశిక్ రెడ్డి తనకు బంధువేనని, అయితే ఆయన పార్టీ వీడటానికి, తనకు సంబంధం లేదని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బల్మూర్ వెంకట్ హుజూరాబాద్ కు స్థానికేతరుడు కాబట్టే ఓటమి పాలయ్యారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను ఎవరికీ ఎమ్మెల్సీ పదవి ఇప్పించేంత స్థాయి లేదని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కౌశిక్ రెడ్డి ని ఉత్తమ్ కుమార్ ప్రోత్సహించారని పొన్నం ప్రభాకర్ చేసిన ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చారు.

డబ్బు లేదని తెలిసినా…?

మరోవైపు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలు రాశారు. తనను హుజూరాబాద్ ఎన్నికల ఓటమిపై సమావేశానికి పిలవలేదని పేర్కొన్నారు. తాను కరీంనగర్ ఇన్ ఛార్జిగా ఉన్నా ఆహ్వానం అందలేదని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు డబ్బు లేదని తెలిసినా ఆయనను అభ్యర్థిగా ప్రకటించారని, పీసీీసీ చీఫ్ పట్టించుకోలేదని జగ్గారెడ్డి లేఖలో తెలిపారు.

సభ ఎందుకు పెట్టలేదు?

అలాగే హుజూరాబాద్ ఎన్నికపై పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఎందుకు బహిరంగ సభ పెట్టలేదని ప్రశ్నించారు. కొండా సురేఖను ఎందుకు అభ్యర్థిగా ప్రకటించలేదని వీహెచ్ ప్రశ్నించారు. మొత్తం మీద ఢిల్లీలో హుజూరాబాద్ ఓటమి పంచాయతీలో మరోసారి కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

Tags:    

Similar News