వైసీపీలోకి మాజీ ఎంపీ ఫ్యామిలీ

మాజీ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ నేత గోకరాజు గంగరాజు కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనుంది. గోకరాజు గంగరాజు సుదీర్ఘకాలం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయన [more]

Update: 2019-12-09 01:31 GMT

మాజీ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ నేత గోకరాజు గంగరాజు కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనుంది. గోకరాజు గంగరాజు సుదీర్ఘకాలం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయన సోదరుడు రామరాజు, నరసింహరాజుతో పాటు గంగరాజు కుమారుడు రంగరాజు సయితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరు ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు సాగించారు. త్వరలోనే జగన్ సమక్షంలో గోకరాజు గంగరాజు కుటుంబం వైసీపీలో చేరనుంది. గోకరాజు గంగరాజు మాత్రం బీజేపీలోనే కొనసాగుతారా? లేక ఆయన కూడా వైసీపీలో చేరతారా? అన్నది చూడాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీికి ఇది ఎదురుదెబ్బేనని చెప్పాలి.

Tags:    

Similar News