ఫారం 7పై అసలు విషయం చెప్పిన ఈసీ

అసలు జనవరి 11వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఓటు కూడా తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. ఫారం [more]

Update: 2019-03-07 10:28 GMT

అసలు జనవరి 11వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఓటు కూడా తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. ఫారం 7 ఇవ్వగానే ఓటు తొలగించినట్లు కాదని, అది ఓటు తొలగించాలని ఒక దరఖాస్తు మాత్రమేనని తెలిపారు. పోలీసు కేసులు మొదలయ్యాక ఫారం 7 దరఖాస్తులు తగ్గిపోయాయని పేర్కొన్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో రాజకీయ పార్టీ వైఖరి సరికాదని, ప్రజలను గందరగోళపర్చడం తప్పని పేర్కొన్నారు. ఓట్లు ఎక్కడ తొలగించారో నిరూపించాలని ఆరోపణలు చేస్తున్న వారికి ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో జనాభా కంటే ఓటర్ల నిష్పత్తి తక్కువ ఉందని, 18 ఏళ్లు నిండిన చాలామంది ఓటర్లుగా నమోదు కాలేదని తాము గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News