బ్రేకింగ్ : రాజధానిలో ఉద్రిక్తత.. ఎర్రకోటకు చేరుకున్న రైతులు

దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. తమకు ఇచ్చిన రూట్ మ్యాప్ లో కాకుండా రైతులు ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు. ఢిల్లీలోకి ప్రవేశించారు. [more]

Update: 2021-01-26 08:48 GMT

దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. తమకు ఇచ్చిన రూట్ మ్యాప్ లో కాకుండా రైతులు ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు. ఢిల్లీలోకి ప్రవేశించారు. ఎర్రకోట వద్దకు చేరుకుని రైతులు కవాతు చేశారు. అడ్డుకున్న పోలీసులపై రైతులు రాళ్లు రువ్వడంతో పలుచోట్ల టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఎర్రకోటకు చేరుకోవడంతో ప్రభుత్వం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోకి ప్రవేశించిన రైతులు ఇక్కడి నుంచి తాము కదలబోమని స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతించేటప్పుడు 37 నిబంధనలను విధించారు. వాటన్నింటని తోసిరాజని ఢిల్లీలోకి రైతులు ప్రవేశించారు. పలుచోట్ల రైతులపై లాఠీ ఛార్జి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో పోలీసులు అనేక మంది గాయపడినట్లు తెలిసింది. రైతులు ఢిల్లీ నగరంలోకి ప్రవేశించడంతో మెట్రోస్టేషన్లంటినీ మూసివేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎర్రకోటపై కిసాన్ జెండా ఎగురవేశారు.

Tags:    

Similar News