బాబు నివాసం వద్ద హైడ్రామా

ఉండవల్లి లోని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. చంద్రబాబు నివాసంలోనికి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు [more]

Update: 2019-09-11 04:17 GMT

ఉండవల్లి లోని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. చంద్రబాబు నివాసంలోనికి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చంద్రబాబు ఇంట్లోకి వెళ్లేందుకు బైకు పై వచ్చారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ అచ్చెన్నాయుడు పోలీసులను ప్రశ్నించారు. తమకున్న ఆదేశాల మేరకు బాబు నివాసంలోకి ఎవరికీ అనుమతి లేదని చెప్పారు. అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హోటల్ లోనే అఖిలప్రియ……

అలాగే మాజీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిని కూడా పోలీసులు బాబు నివాసంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇక అఖిలప్రియను నోవాటెల్ హోటల్ లోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అఖిలప్రియ వారితో వాగ్వాదానికి దిగారు. తన సోదరుడు గదిని ఎందుకు తనిఖీ చేయాల్సి వచ్చిందో చెప్పాలని అఖిలప్రియ ప్రశ్నించారు.

Tags:    

Similar News