బ్రేకింగ్ : అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా

2002 లో తాను టీఆర్ఎస్ లో చేరానన, పార్టీకి మచ్చ తెచ్చే పని ఏనాడు చేయలేదని ఈటల రాజేందర్ తెలిపారు. అసైన్డ్ భూములు కొంటే తాను శిక్షకు [more]

Update: 2021-05-03 06:11 GMT

2002 లో తాను టీఆర్ఎస్ లో చేరానన, పార్టీకి మచ్చ తెచ్చే పని ఏనాడు చేయలేదని ఈటల రాజేందర్ తెలిపారు. అసైన్డ్ భూములు కొంటే తాను శిక్షకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఒక పథకం ప్రకారమే తనపై కుట్ర జరిగిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. శాఖల అధికారులతో స్వయంగా కేసీఆర్ మాట్లాడారన్నారు. తనకు సంబంధం లేని భూములను కూడా అంటగట్టారని ఈటల రాజేందర్ అన్నారు. వేల ఎకరాల భూములను కబ్జా చేశారని తప్పుడు ప్రచారం చేశారన్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ ఎప్పుడూ అధర్మం వైపు వెళ్లలేదన్నారు. వావి వరసలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. విలువ లేని భూముల్లో చెట్లు కొట్టేశారని కేసులు పెడుతున్నా రన్నారు. తన లాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్ని ఉపయోగించారన్నారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు.

వివరణ కూడా….

కనీసం తన వివరణ కూడా అడగలేదని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారానికి ఉంది కదా అని చట్ట వ్యతిరేకంగా పనిచేయకూడదని హితవు పలికారు. న్యాయస్థానాల్లో తనకు న్యాయం జరుగుతుందని ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మీ వ్యవసాయ క్షేత్రంలో రోడ్లు ఎన్ని గ్రామాల నుంచి వేశారని ఆయన ప్రశ్నించారు. ప్రజలను ప్రలోభపెట్టి, బెదిరించి తనకు వ్యతిరేకంగా చెప్పించారని ఈటల రాజేందర్ అన్నారు. అరెస్ట్ లకు, కేసులకు భయపడే వాడిని కాదన్నారు. పార్టీ పట్ల కమిట్ మెంట్ లేకపోతే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే వెళ్లేవాడినని ఈటల రాజేందర్ తెలిపారు. తాను అన్ని వదులు కోవడానికి సిద్ధమే కాని ఆత్మగౌరవాన్ని చంపుకోలేనన్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని, అయితే తన నియోజకవర్గాల ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఈటల రాజేందర్ తెలిపారు.

పార్టీ మారతానని…..

పార్టీ పెడతానని, మారతానని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. కేసీఆర్ శిష్యుడిగానే తాను రాజకీయంగా ఎదిగానని ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ వల్లనే తనకు గుర్తింపు వచ్చిందన్నారు. నాఆస్తులపై నిజాయితీ గా సుప్రీంకోర్టు జడ్జిపై విచారణ జరపాలన్నారు. ఈరోజు తానొక్కడినేనని, భవిష్యత్ లో తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని చెప్పారు. మీ మంత్రివర్గంలో ఎవరూ ఆత్మగౌరవంతో ఉండటం లేదన్నారు. చావునైనా భరిస్తా తప్ప ఆత్మగౌరవాన్ని చంపుకోనని చెప్పారు. తాను ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నానని, ఎప్పుడూ చెడిపోనని ఈటల రాజేందర్ తెలిపారు.

Tags:    

Similar News