బ్రేకింగ్ : జగన్ సర్కార్ కొరడా… ఐదుగురి సస్పెన్షన్…!!

అవినీతిపై జగన్మోహన్ రెడ్డి సర్కార్ కొరడా ఝూలింపించింది. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఐదుగురు ఇంజనీరింగ్ శాఖ అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం [more]

Update: 2019-05-31 09:31 GMT

అవినీతిపై జగన్మోహన్ రెడ్డి సర్కార్ కొరడా ఝూలింపించింది. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఐదుగురు ఇంజనీరింగ్ శాఖ అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కడప జిల్లా శ్రీనివాసపురం రిజర్వాయర్ కాలువ తవ్వకాల పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, హంద్రీనీవా పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఐదుగురిపై వేటు పడింది. వీరి వ్యవహారంపై రిటైర్డ్ ఐపీఎస్ సత్యనారాయణ చేత విచారణ జరిపేందుకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అవినీతి రహిత పాలన చేస్తానని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటపెడతానని జగన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News