మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

Update: 2018-08-06 09:21 GMT

ఛత్తీస్ ఘడ్.. కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాయి గూడెం, గొల్లపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో 16 మంది మావోలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి మావోయిస్టులకు చెందిన ఆయుధాలను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. సి.ఆర్.పి.ఎఫ్, ఎస్.టి.ఎఫ్, డి.ఆర్.జి దళాల సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ ను పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ మీనా ధృవీకరించారు.

ఆంధ్రలో హైఅలెర్ట్...

ఛత్తీస్ ఘడ్ ఎంకౌంటర్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని సరిహద్దు జిల్లాల్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల షెల్టర్ జోన్ అయిన వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లో భద్రతా దళాలను అలర్ట్ చేసినట్లు పోలవరం డీఎస్పీ టి.రవికుమార్ తెలిపారు. కూంబింగ్ దళాలను సిద్ధం చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు భద్రతను పెంచారు

Similar News