ఎన్నికల రిజల్ట్... ఆలస్యం...ఎందుకంటే....?

Update: 2018-12-10 12:46 GMT

ఎన్నికల కౌంటింగ్ రేపు ప్రారంభంకానుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే గత ఎన్నికలకంటే ఈసారి ఎన్నికల ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకు కారణాలు ఎన్నికల కమిషన్ నూతనంగా విధించిన నిబంధనలే కారణం. రేపు తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ , మిజోరాం రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కూడా జరగనుంది. గతంలో ప్రతి రౌండ్ ఎన్నికల ఫలితాలను వెంటనే ప్రకటించేవారు.

అభ్యంతరాలు లేకుంటేనే....

అయితే మారిన నిబంధనల ప్రకారం ప్రతి రౌండ్ ఫలితం తెలియగానే దానిని స్టేట్ మెంట్ రూపంలో ముందు అభ్యర్థులకు ఇస్తారు. వారి అభ్యంతరాలను తెలుసుకుంటారు. అభ్యంతరాలు ఎవరైనా తెలిపితే తిరిగి కౌంటింగ్ చేస్తారు. అభ్యంతరాలు లేకుంటేనే దానిపై రిటర్నింగ్ అధికారి సంతకం చేసి అధికారికంగా మీడియాకు ఇచ్చి, ఆ తర్వాత వెబ్ సైట్ లో పెడతారు. ప్రతి రౌండ్ ఫలితం స్టేట్ మెంట్ రూపంలో పెట్టిన తర్వాతే విడుదల చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక నియోజకవర్గం పూర్తి స్థాయి ఫలితం తేలాలంటే గతంలో కంటే రెండు గంటలు ఆలస్యమవుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధనను రేపటి నుంచి అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో అమలుపర్చనున్నారు.

Similar News