స్కామ్ చేశారు...అదిరిపోయింది....!

Update: 2018-07-14 03:47 GMT

స్పోర్ట్స్ కోటా మెడికల్ సీట్ల స్కామ్ లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్కామ్ లో తవ్విన కొద్ది అక్రమాలు బయట పడుతున్నాయి.. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన ఎసిబి అధికారులు ఇప్పడు మరొక ఇద్దరిపైన కేసులు పెట్టింది. ఏకంగా నకీలీ సర్టిఫికేట్లలను అమ్ముకుంటున్న కోచ్‌ తో పాటుగా తెలంగాణ స్పోర్ట్స్ డిప్యూటి డైరెక్టర్ లపైన ఎసిబి కేసులు నమోదు చేసి విచారణ చేస్తుంది. గత ఏడాది కాలంలో పద కొండు మెడికల్ సీట్ల కోసం స్సోర్ట్స్ అధికారులు దొడ్డి దారిన అమ్ముకున్నారని వెలుగోకి వచ్చింది.

కొత్త విషయాలు.....

దేశ^వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న స్సోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్ల వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు బయట పడుతున్నాయి. ఈ కొత్త విషయాలను చూసిన ఎసిబి అధికారులే విస్తుపొతున్న తీరు ఇది. మెడికల్ స్టీట్ల కోసం ఏకంగా నకీలీ సర్టిఫికెట్లను తయారీ చేశారు. తెలంగాణ స్సోర్ట్స్ డిప్యూటి డైరెక్టర్ వెంకటరమణ తో పాటుగాకోచ్ లు కలిసి ఈ దందా చేసినట్లుగా అవినీతి నిరోధక శాఖ తేల్చింది. ఒక బాధితుడు ఈ అధికారులు దందాపైన సాక్ష్యాలతో సహా వచ్చి ఎసీబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సాక్ష్యాలను పరిశీలించిన ఎసిబి అధికారులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులో ఇద్దరు అధికారులే స్కామ్ చేసినట్లుగా తెలింది.

అర్హులైన వారికి.....

గత మొత్తం మెడికల్ కోటాలో 44 సీట్ల ను సంపాందించారు. ఇందులో అర్హులైన వారికి సీట్లు రాలేదు. దీంతో బాధిత క్రీడాకారులు ముఖ్యమంత్రిని కలిసి తాము ఎలా మోస పోయామో చెప్పారు. దీనిపైన సమగ్ర విచారణ కొరకు అవినీతి నిరొధక శాఖకు అప్పగించారు. అయితే నెల రొజుల క్రితం ఈస్కామ్ పైన విచారణ చేసిన అధికారులు ఇందులో చాల అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. అంతేగాకుండా చాల విభాగాల్లో నిజమైన క్రీడాకారులకు కాకుండా ఇతరులకు మెడికల్ సీట్లు ఇప్పించినట్లుగా గుర్తించి స్సోర్ట్స్ అధికారులపైన కేసులు నమోదు చేసి విచారణ చేశారు. అయితే ఈ కేసులపైన విచారణచేస్తున్న తరుణంలో మరొక ఫిర్యాదు వచ్చింది.

జూడో క్రీడ పేరు చెప్పి.....

తెలంగాణ జూడొ అసోసియేషన్ లో కార్యదర్శిగా పనిచేస్తున్న కైలాస్‌ యాదవ్ ఈ కేసులో ప్రధాన సూత్రధారుడు. కైలాస్ యాదవ్ మెడికల్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. వరంగల్ జిల్లాకు చెందిన తోట సునిల్ కూమార్ అనే క్రీడాకారుడు నుంచి డబ్బులు వసూలు చేశాడు. మెడికల్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి నాలుగు లక్షలు రూపాయలు తీసుకున్నాడు. అడ్వాన్స్ కింద రెండు లక్షలు తీసుకున్నాడు. తీసుకుని ఒక్క సర్టిపికెట్ ను కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ సర్టిపికెట్ మొత్తానికి నకలీది. ఈసర్టిఫికెట్‌ ను తీసుకుని కౌన్సిలింగ్ పొవడంతో అతనికి మెడికల్ సీట్ రాలేదు .. సరిగదా. అది నకీలీ సర్టిపికెట్ అని తేలింది. దీంతో మెడికల్ సీట్లు కొరకు నకీలీ సర్టిఫికెట్స్ తయారీ చేసి విక్రయిస్తున్న కార్యదర్శి కైలాస్ పైన ఎసిబి కి సునీల్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎసిబి కేసులు నమోదు చేసి విచారణ చేపట్టింది.

జైల్లో ఉన్న వెంకటరమణను....

ఇక పొతే కైలాష్ కు పూర్తి స్థాయిలో సహాయం చేసిన డిప్యూటి డైరెక్టర్ వెంకటరమణ పైన ఎసిబి కేసులు నమోదు చేసింది. ఇప్పటికే వెంకటరమణ అరెస్టు అయి జైల్లో వున్నాడు. దీంతో ఎసిబి అధికారులు కార్యదర్శి కైలాష్ యాదవ్ ఇండ్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వరంగల్ తో పాటుగా హైదరబాద్ లోని జూడో కార్యాలయంలో ఎసిబి సొదాలు జరిపింది. అయితే ఎసిబి విచారణ లో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయని అధికారులు తెలిపారు.

11 మెడికల్ సీట్లు....

గత ఏడాది మొత్తం పదకొండు మెడికల్ సీట్లు ఒక్క జూడొ ఆడుతున్న వారికే వచ్చాయని. మెడికల్ సీట్లు పొందిన వారంతా కూడా ప్రస్తుతానికి మంచి ర్యాంకు లు సంపాందించి గాంధీ , ఉస్మానియా కాలేజీలో చదువుకుంటున్నారని ఎసిబి అధికారులు తెలిపారు. ఒక్క జూడొ నుంచి పదకొండు మంది గత ఎడాది మెడికల్ సీట్లు పొందారని, అన్నింటిన్ని కూడా పరీశీలిస్తామని ఎసిబి అధికారులు చెబుతున్నారు. గతంలో పొందిన మెడికల్ సీట్లు వ్యవహారం ఇప్పడు పూర్తి స్దాయిలో బయటికి వస్తాయని ఎసిబి చెబుతుంది. ఇప్పిటికే అరెస్టు అయిన జైల్లో వున్న వెంకటరమణ సహాయంతో ఈ నకీలీ సర్టిపికెట్స్ తయారీ చేసి అభ్యర్దులకు ఇచ్చారని, ఇందులో డిప్యూటి డైరెక్టర్ పాత్ర వుందని. ప్రస్తుతానికి జైల్లో వున్న వెంకటరమణను త్వరలోనే కోర్టు అనుమతి తో కస్టడీ తీసుకుంటామని ఎసిబి తెలిపింది. ఏది ఎమైనా స్సోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్ల స్కామ్ లో ఇప్పడు కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి. త్వరలో ఒక్క మేజర్ బ్రేక్ త్రూ కూడా వస్తుందని ఎసిబి చెబుతుంది.

Similar News