దుర్గాడలో విషాదం

Update: 2018-08-02 08:23 GMT

తూర్పుగోదావరి జిల్లా దుర్గాడలో విషాదం అలుముకుంది. గ్రామంలో గత 26 రోజులుగా పూజలు అందుకుంటున్న పాము కన్నుమూసింది. 26 రోజుల క్రితం ఓ పొలంలో పాము కనిపించింది. అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. దీంతో పామును సుబ్రమణ్యేశ్వర స్వామి ప్రతిరూపంగా గ్రామస్థులు భావించారు. దీంతో పెద్దఎత్తున గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు పామును చూడటానికి తరలివచ్చారు. భక్తుల వద్దకు వచ్చినా, భక్తుల మీద నుంచి వెళ్లినా పాము వల్ల ఎవరికీ హాని కలగగలేదు. దీంతో భక్తుల విశ్వాసం పెరిగింది. 26 రోజులుగా పాముకు ఆహారం కూడా లేదు. అయితే, మొదట పాము కుబుసం విడిచే సమయంలో ఉందని, అందుకే అది అలసటతో ఉందని డాక్టర్లు భావించారు. మొన్న కుబుసం విడిచిన పాము కొంత ఉత్సాహంగా మారింది. అయినా, అక్కడి నుంచి వెళ్లలేదు. ఇవాళ కూడా భక్తులు పెద్దసంఖ్యలో రాగా, వారి ముందే పాము మరణించింది. దీంతో భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ ప్రాంతంలో గుడి కట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Similar News