డీకే ధమ్కీ ఇచ్చారే…..!!!!

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరుజిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆమె భారతీయ [more]

Update: 2019-03-20 01:50 GMT

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరుజిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆమె భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న అర్థరాత్రి ఒంటిగంటకు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో డీకే అరుణ కాషాయ కండువాను కప్పుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గద్వాల్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయితే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు డీకే అరుణ భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు లేవని, ఆ పార్టీకి భవిష్యత్ లేదని గ్రహించిన డీకే బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్ కు ఇది ఊహించని ఎదురుదెబ్బ.

Tags:    

Similar News