సీత..టెస్ట్ ట్యూబ్ బేబీ అంట

Update: 2018-06-02 08:52 GMT

ఈ మధ్య కొందరు బీజేపీ నాయకులు మాటలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఇప్పటికే వీరి మాటలు కొన్ని సోషల్ మీడియాతో ట్రోల్ అవ్వడంతో పాటు పార్టీ పరువును కూడా గంగలో కలిపాయి. అయినా కూడా బీజేపీ నేతలు మారినట్లు కనిపించడం లేదు. తాజా, ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి దినేష్ శర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఇంతకీ ఆయన ఏమంటాడంటే... సీత టెస్ట్ ట్యూబ్ బేబీ అంట. జనకుడికి సీత భూమిలోని ఒక కుండలో లభించిందని, అంటే ఆ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి టెక్నాలజీ ఉందనేది ఆయన వింత, విచిత్ర వాదన.

అప్పుడే జర్నలిజమంట...

హిందీ జర్నలిజం డే కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మరిన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మహాభారత కాలం నుంచే జర్నలిజం ఉందని, సంజయుడు దృతరాష్ట్రుడికి కురుక్షేత్ర యుద్ధం చూపించాడని, అంటే అది ప్రత్యక్షప్రసారమేనని, సంజయుడు జర్నలిస్టు అనేది దినేశ్ శర్మ వాదన. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాతో ట్రోల్ అవుతున్నాయి. ఇప్పటికే త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ ప్రాచీణ భారతంలోనే ఇంటర్నెట్ ఉండేదని వ్యాఖ్యానించి పరువు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.

Similar News