మిస్టర్ కూల్ కి కోపం వస్తే...

Update: 2018-07-11 11:17 GMT

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ది చాలా విలక్షణ స్వభావం. ఎంత పెద్ద మ్యాచ్ అయినా, ఒటమి అంచున ఉన్నా అతడు మాత్రం కూల్ గా, నిదానంగా తన జట్టు సభ్యులకు సూచనలు చేస్తుంటాడు. ఎప్పుడూ ఏ ఆటగాడిపైనా కోపం ప్రదర్శించిన సందర్భం క్రికెట్ అభిమానులు చూడలేదు. అయితే, మిస్టర్ కూల్ కి కూడా కోసం వచ్చే పని చేశాడంట భారత స్పిన్ బైలర్ కుల్ దీప్ యాదవ్. ఇటీవల ‘వాట్ ఎ డక్’ షోలో పాల్గొన్న స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ ధోనితో తన అనుభవాన్ని పంచుకున్నాడు.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో.....

‘‘ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక భారీగా పరుగులు చేస్తోంది. నా ఓవర్ లో వరుసగా బౌండరీలు కొడుతున్నారు లంక బ్యాట్స్ మెన్ లు. దీంతో ధోని వచ్చి ఫీల్డింగ్ సెటప్ మార్చాలని సూచించాడు. అయితే... ఇలా ఉంటే బాగానే ఉంది అని తాను సమాధానం చెప్పడంతో ధోనికి కోపం వచ్చిందన్నాడు కులదీప్ యాదవ్. ‘నేను ఇక్కడ పిచ్చోడినా, 300 వన్డే మ్యాచ్ లు ఆడాను’ అని అరిచాడు. దీంతో నేను ధోనీ చెప్పినట్లుగా ఫీల్డింగ్ మార్చగా, వెంటనే విక్కెట్ తీయగలిగాను’’ అని కుల్ దీప్ యాదవ్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.

Similar News